బజ్..”ఆదిపురుష్” కు మరో స్థాయి హంగులు..?

Published on Jun 12, 2021 7:11 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న అతి పెద్ద విజువల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా స్పాన్ ఇప్పుడు మరింత పెరిగుతున్నట్టు తెలుస్తోంది.

బాహుబలికి మించిన స్థాయిలో వి ఎఫ్ ఎక్స్ ఉందనే కాకుండా ఈ చిత్రాన్ని మరో స్థాయిలో కూడా విడుదల చేసే సూచనలు ఉన్నాయని ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషలతో పాటుగా ఇంగ్లీషు భాషలో కూడా అంటే పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే..

సంబంధిత సమాచారం :