రాజ్ తరుణ్ కొరకు ‘సమ్మోహనం’ భామ…!

Published on Jun 19, 2019 11:54 am IST

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా “గుండెజారి గల్లంతయ్యిందే” ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఐతే ఈ మూవీలో రాజ్ తరుణ్ కి జోడీగా బాలీవుడ్‌ భామ అదితిరావు హైదరి ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకోసం త్వరలో ఆమెతో సంప్రదింపులు జరపనున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఈ ప్రాజెక్ట్ పై అదితి రావ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

గతంలో అదితి రావ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడిగా సుధీర్ హీరోగా విడుదలైన ‘సమ్మోహనం’, మూవీలో నటించారు. అలాగే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న నాని మూవీ “వి” లో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కూడా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More