నన్ను ఎవరు చూపించని విధంగా చూపించారు – ఆదిత్య మీనన్

aditya

తన గంభీరమైన నటనతో రౌద్రరమైన గొంతుతో గత కొన్ని సినిమాలుగా తెలుగు సినిమాల్లో విలన్ గా రాణిస్తున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ‘ఆదిత్య మీనన్’. ఇటీవలి కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ‘విలన్‌’ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు ఆయన. ‘సింహ’ సినిమాతో తెలుగు తెరకు పవర్ ఫుల్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆదిత్య.. తాజాగా ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సి. కల్యాణ్‌ నిర్మించారు. కాగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తానూ చాల కాలం నుండి ఎదురుచూస్తున్న పవర్ ఫుల్ పాత్ర ఈ సినిమాలో చేశానని.. ఈ పాత్రలో నేను మాత్రమే చేయాలని భావించిన నిర్మాత సి. కల్యాణ్‌ గారికి కృతజ్ఞతలు. అలాగే దర్శకుడు భాను శంకర్ చౌదరి రాసుకున్న మంచి కథలో తానూ కూడా భాగమైనందుకు చాల సంతోషంగా ఉందని.. అన్నిటికిమించి ఇంతవరకూ నన్ను ఎవరూ చూపించని విధంగా చూపించిన కెమెరామెన్ రాంప్రసాద్ కి థాంక్స్ అని చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో ఆకట్టుకునే ఆదిత్య మీనన్, ఇటీవలే విడుదలైన గుణ 369 మరియు బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాల్లో కూడా ఫుల్ లెంగ్త్ మంచి పాత్రలను పోషించారు. ఇక ఆయన తాజాగా నటించిన ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా పై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి ర‌ధ‌న్ సంగీతం అందిస్తుండగా సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Exit mobile version