‘వెంకీ మామ’ ఆడియో అమ్ముడుపోయింది !

Published on Oct 31, 2019 6:14 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి వరుస అప్ డేట్స్ వస్తాయని ఈ రోజు ఉదయం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ను వదిలింది. ‘వెంకీ మామ’ చిత్ర ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే పనులో ఫుల్ బిజీగా ఉన్నామని.. అలాగే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం యొక్క ఫైనల్ మిక్స్ జరుగుతుందని.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని తమన్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More