మహేష్ “సర్కారు వారి పాట” పై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 15, 2022 4:32 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం పై సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పై, మహేష్ పై నటుడు అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

సర్కారు వారి పాట మనియా ప్రపంచాన్ని తాకింది అంటూ చెప్పుకొచ్చారు. నేను విన్నది నిజమేనా, వరుసగా 8 వ సారి యూ ఎస్ లో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. సూపర్ మహేష్ గారు, కంగ్రాట్స్. చిత్ర యూనిట్ కి సైతం కంగ్రాట్స్ తెలిపారు అడివి శేష్. సర్కారు వారి పాట తుఫాన్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :