సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకున్న నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో మరో యువహీరో జత కట్టడం విశేషంగా కనిపిస్తోంది.
‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’ లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ‘దొంగాట’ సినిమా ద్వారా హీరోగానూ హిట్ కొట్టిన ఆడవి శేష్, అసుర సినిమాకు వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. నారా రోహిత్ కోరగా వెంటనే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించేందుకు ఓకే చెప్పారట అడవి శేష్. ప్రియా బెనర్జీ హీరోయిన్‌గా నటీంచిన ఈ సినిమాకు నారా రోహిత్ నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం.


