గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనున్న అడివి శేష్ ‘గూఢచారి – 2’

Published on Jul 21, 2022 3:00 am IST

యువ నటుడు అడివి శేష్ నుండి మూవీ వస్తుంది అంటే ఆడియన్స్ లో తప్పకుండా ఆ మూవీ పై మంచి క్యూరియాసిటీ నెలకొని ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ మూవీ నుండి మొన్నటి మేజర్ వరకు నటుడిగా విభిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరిస్తున్న అడవి శేష్ ప్రస్తుతం హిట్ 2 మూవీ చేస్తున్నారు. అయితే దీనితో పాటు అడివి శేష్ లిస్ట్ లో గూడచారి 2 కూడా ఉంది. కాగా ఈ మూవీ గురించి ఇటీవల మీడియాతో మాట్లాడిన శేష్, నిజానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని ఆడియన్స్ భావిస్తున్నారని, అయితే ప్రస్తుతం తమ మనసులో ఉన్న ఒక లైన్ ని పూర్తి స్క్రిప్ట్ గా డెవెలప్ చేస్తున్నామని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుందని అన్నారు.

తప్పకుండా గూఢచారి 2 అందరి అంచనాలు అందుకునేలా తీసేందుకు టీమ్ కష్టపడుతోందని చెప్పారు శేష్. శశికిరణ్ టిక్కా తీసిన గూఢచారి మూవీ 2018లో ప్రేక్షకుల ముందు వచ్చి పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇందులో రా ఏజెంట్ గోపి పాత్రలో కనిపించారు అడివి శేష్. మరి త్వరలో తెరకెక్కనున్న గూఢచారి 2 రిలీజ్ అనంతరం ఎంత మేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. కాగా ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానున్నాయి.

సంబంధిత సమాచారం :