మా “మేజర్” కి కూడా స్పెషల్ ఎమోజి ఉంది..శేష్ రిప్లై వైరల్.!

Published on May 23, 2022 8:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో అడివి శేష్ హీరోగా సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన చిత్రం “మేజర్” కూడా ఒకటి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాని శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి గాను మరికొన్ని రోజులు మాత్రమే సమయమే ఉండగా మేకర్స్ ఇప్పుడు మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అడివి శేష్ మంచి యాక్టీవ్ గా ఉంటూ సినిమా ప్రమోషన్స్ చేస్తుండగా ఇటీవల సినిమాలకి ట్విట్టర్ లో ట్రెండ్ గా మారిన స్పెషల్ ఎమోజి టాపిక్ తనకి ప్రశ్నగా వచ్చింది.

అయితే దానికి రిప్లై ఇస్తూ శేష్ ఇచ్చిన సమాధానం మంచి ఆసక్తిగా ఎమోషనల్ గా ఉందని చెప్పాలి. తమ సినిమాకి కూడా ఎమోజి ఉంది అయితే అది మన దేశపు మువ్వెన్నల జెండా అంటూ జాతీయ పతాకాన్ని చూపించాడు. ఇదే మా సినిమా ఎమోజి అని సినిమాలోని తనలోని దేశ భక్తి కోసం చాటుకున్నాడు. ఈ రిప్లై అయితే ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :