డెకాయిట్ తర్వాతే గూఢచారి 2.. అడివి శేష్ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేనా..?

డెకాయిట్ తర్వాతే గూఢచారి 2.. అడివి శేష్ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేనా..?

Published on May 18, 2025 2:00 AM IST

G2

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో హీరో అడివి శేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలు కూడా ఉన్నాయి. డెకాయిట్, గూఢచారి 2 చిత్రాలను అడివి శేష్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే, ఈ సినిమాల్లో ఏది ముందుగా రిలీజ్ అవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.

కాగా, ఈ రెండు చిత్రాల్లో డెకాయిట్ మూవీ ముందుగా రిలీజ్ కానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. షానియేల్ డియో డైరెక్షన్‌లో వస్తున్న డెకాయిట్ చిత్రంలో తొలుత అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. కొంతమేర షూటింగ్ జరుపుకున్న తర్వాత, ఆమె ఈ సినిమా నుంచి వాకౌట్ చేసింది. దీంతో ఆమె ప్లేస్‌లో మరో బ్యూటీ మృణాల్‌ను ఓకే చేశారు. ఇక ఆ తర్వాత శరవేగంగా ఈ చిత్ర షూటింగ్‌ను జరుకుంటూ వస్తున్నారు.

అటు గూఢచారి 2 చిత్రం మాత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్‌గా దర్శకుడు వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చవుతుండటంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో అడివి శేష్ నుంచి తొలుత వచ్చే చిత్రం డెకాయిట్ అని సినీ సర్కిల్స్‌లో వార్త వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు