అడివి శేష్ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్

Published on May 8, 2021 12:00 am IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్ కొత్త చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఈ చిత్రంలో దేశభక్తి అనేది ప్రధాన అంశం. అదే సినిమా మీద ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి సినిమా చేస్తున్నందుకు శేష్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా అడివి శేష్ కుటుంబానికి పేట్రియాటిజం కొత్త కాదు. ఆయన తాతగారు స్వాతంత్య్రం కోసం పోరాడారు.

ఈ విషయాన్ని శేష్ స్వయంగా తెలిపారు. శేష్ సోషల్ మీడియాలో తన తాతగారు అడవి గంగరాజుగారికి భారత ప్రభుత్వం తామ్రపత్రాన్ని ఇచ్చినట్టు జారీ అయిన ధృవీకరణ పత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. పశ్చిమగోదావరిలోని ఏలూరు గంగరాజుగారి సొంత ఊరు. స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు కృషి చేసినందుకుగాను 1973లో భారత ప్రభుత్వం ఆయనకు విశిష్టమైన తామ్రపత్రాన్ని అందించింది. దాన్ని ధృవీకరిస్తూ 1997లో అప్పటి వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ధృవీకరణ పత్రం జారీ చేశారు. దీన్నే సోషల్ మీడియాలో షేర్ చేసిన శేష్ తన తాతగారిని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత సమాచారం :