అడివి శేష్ “హిట్2” హిందీ లో రిలీజ్ కి రెడీ!

అడివి శేష్ “హిట్2” హిందీ లో రిలీజ్ కి రెడీ!

Published on Dec 22, 2022 9:00 AM IST

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఒక ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయిన హిట్ ది సెకండ్ కేస్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మళ్లీ భారీ విజయాన్ని అందుకున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో శేష్ మాట్లాడుతూ, హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

ఇప్పుడు, ఈ సూపర్ హిట్ చిత్రం డిసెంబర్ 30, 2022 న నార్త్ బెల్ట్‌లో ప్రేక్షకులను అలరించడానికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హిందీలో గ్రాండ్ మాస్టర్ మరియు బి4యు మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. కోమలి ప్రసాద్, రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించడం జరిగింది. హీరో నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమా కి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు