ఆ 15 రోజుల తర్వాత ఓ తండ్రిగా బన్నీ వెల కట్టలేని ఆనందం.!

Published on May 12, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజే తాను కోవిడ్ నుంచి బయట పడి నెగిటివ్ గా నిర్ధారణ కాబడ్డనని తెలిపి అభిమానులకు సహా తన వెల్ విషర్స్ కు శుభ వార్తను బన్నీ తెలియజేసాడు. అయితే తాను కరోనా పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి స్వీయ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ 15 రోజుల సుదీర్థ విరామం అనంతరం తన కుటుంబాన్ని కలిసాడు. అయితే బన్నీ ఎంత స్టైలిష్ అయ్యి ఐకాన్ అయినా ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా ఆ వాత్సల్యం తన పిల్లల పట్ల మరోసారి వ్యక్తం చేసాడు.

తన రూమ్ లోనుంచి బయటకు వచ్చిన బన్నీ తన ఇద్దరు పిల్లల స్వీట్ హగ్స్ తో మునిగిపోయాడు. ఆ అపురూప దృశ్యాలను వీడియోతో తన సోషల్ మీడియా ద్వారా పంచుకొని ఈ 15 రోజులు తన పిల్లలని ఎంతలా మిస్ అయ్యాడో చెప్తూ వెల కట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేసాడు.. దీనితో ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :