స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అల వైకుంఠపురములో”. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందించిన ఈ చిత్రం మన తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టడ్ ఆల్బమ్ గా మారింది.
ఏకంగా 1 బిలియన్ స్ట్రీమింగ్స్ యూట్యూబ్ లో కొల్లగొట్టి మన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే ఏ చిత్రం కూడా నెలకొల్పని రికార్డును అతి తక్కువ సమయంలోనే నమోదు చేసింది. అయితే యూట్యూబ్ లో 1 బిలియన్ స్ట్రీమింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ ఆల్బమ్ తర్వాత మన దక్షిణాదిలో ఉన్న మరో హీరో దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే ధనుష్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మారి 2” యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం అల వైకుంఠపురములో లాంటి బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అని చెప్పలేం కానీ ఆ సినిమాలో రౌడీ బేబీ అనే ఒక పాటే పెద్ద హిట్ అయ్యింది.
ఇప్పటి వరకు 844 మిలియన్ వ్యూస్ ఈ వీడియో సాంగ్ సాధించడం మూలాన ఈ సినిమా మొత్తం ఆల్బమ్ కు ఇప్పుడు 999 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనితో బన్నీ తర్వాత 1 బిలియన్ మార్క్ ను అందుకోడానికి ధనుష్ సినిమాకు ఇప్పుడు అవకాశం ఏర్పడింది. కానీ బన్నీ సినిమాలా అన్ని పాటలు హిట్టయ్యి ఇలాంటి ఫీట్ సాధించడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదనే విషయం అని చెప్పాలి.


