ఆఫ్టర్ గ్యాప్..ఈ సినిమాతో స్టార్ట్ చేయనున్న ప్రభాస్.?

Published on Jun 12, 2021 9:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో అన్ని ముఖ్య సినిమాలు కూడా షూటింగ్ కి పెండింగ్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన మరో భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” మరియు దర్శకుడు రాధా కృష్ణ తో ప్లాన్ చేసిన చిత్రం “రాధే శ్యామ్” లు ఉన్నాయి. పైగా ఈ మూడు చిత్రాలు కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోనున్నాయి.

అయితే మరి వరుసగా ఉన్న ఈ మూడు చిత్రాల్లో చాలా కాలం విరామం తర్వాత ప్రభాస్ స్టార్ట్ చేసేది రాధే శ్యామ్ షూట్ నే అన్నట్టు తెలుస్తుంది. ఈ మిగతా చిత్రాలతో పోలిస్తే రాధే శ్యామ్ కే తక్కువ పెండింగ్ వర్క్ ఉండడం మూలాన మొదట ఈ చిత్రాన్ని ఫినిష్ చేసేస్తే ఇక కంప్లీట్ గా దృష్టి అంతా ఆదిపురుష్ మరియు సలార్ పై పెట్టొచ్చని ప్రభాస్ భావన. అందుకే రాధే శ్యామ్ మొదలు పెట్టి కంప్లీట్ చేసేయాలని చూస్తున్నాడట. ఇక అలాగే అతి తొందరలోనే ఈ చిత్రం షూట్ స్టార్ట్ అవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :