“కేజీయఫ్ 2” తర్వాత వరల్డ్ లెవెల్లోకి యష్.!

Published on Jul 17, 2021 11:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. మరి అన్నీ బాగుంటే నిన్ననే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మూలాన వాయిదా పడింది. టీజర్ తో ఈ భారీ విజువల్ ట్రీట్ పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా యష్ చేసిన రాకీ భాయ్ రోల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కటౌట్ కి ఉన్న ఇంపాక్ట్ మరోసారి విట్నెస్ చెయ్యాలని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత యష్ కి ఉన్న క్రేజ్ ఒక్క పాన్ ఇండియా తో కాదు ప్రపంచ స్థాయిలోకి వెళ్తుంది అని ఎవరో కాదు ఈ సినిమాకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ నే చెప్పాడు.

నిన్న కేజీయఫ్ మేకర్స్ అంతా పెట్టుకున్న క్లబ్ హౌస్ లో ఈ విషయాన్ని భువన్ తెలిపాడు. దీనిని బట్టి రాకీ రోల్ చాప్టర్ లో ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ భారీ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :