ఇప్పుడు సంక్రాంతి సీజన్ తో కొత్త సినిమాలతో మళ్ళీ సందడి వాతావరణం ఒదలయ్యింది. అయితే ఈసారి కొత్త సినిమాల విడుదలలతో పాటు సాలిడ్ చిత్రాల టీజర్స్ పండుగ కూడా వస్తుండడంతో మన సినీ ప్రేమికులకు మరింత సందడి దోరిక్నట్టు అయ్యింది. అయితే ఇప్పుడు మన దక్షిణాది నుంచి రానున్న బిగ్గెస్ట్ సినిమాల టీజర్స్ జాబితాలో “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ ఉంది.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఈ జనవరి 8న విడుదల కానుండగా సరిగ్గా ఆ తర్వాత రోజునే మరో ఇంట్రెస్టింగ్ సినిమా టీజర్ విడుదలకు రెడీ అయ్యింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “కోబ్రా” నుంచి. అజయ్ జ్ఞ్యాన ముత్తు తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ చిత్రంలో చియాన్ ఏకంగా 20 కి పైగా పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే జనవరి 9నే ఈ చిత్రం టీజర్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే పోస్టర్స్ తో కూడా మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇందులో విక్రమ్ చేసిన రోల్స్ కు సంబంధించి ఎన్ని రివీల్ చేస్తారో కూడా చూడాలి.
Wishing dearest @arrahman sir a very very Happy Birthday!! ????????❤️❤️ Love you sir!! CVFs Ready!!?? #Cobra #CobraTeaser #ChiyaanVikram @7screenstudio @Lalit_SevenScr @IrfanPathan @SrinidhiShetty7 @theedittable @dop_harish @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/YCCorMkqS2
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) January 6, 2021


