“ఈటి” కోసం సూర్య చాన్నాళ్ళకి ఇంట్రెస్టింగ్ స్టెప్.!

Published on Feb 12, 2022 4:06 pm IST


కోలీవుడ్ కి చెందిన అతి తక్కువ మంది స్టార్ హీరోల లోనే మన తెలుగు లో మంచి మంచి మార్కెట్ ఉన్న వారు ఉన్నారు. మరి వారిలో సూర్య కూడా ఒకరు. ఎప్పుడు నుంచో టాలీవుడ్ లో మంచి ఫేమ్ తో కొనసాగుతున్న సూర్య ఇప్పుడు అటు తమిళ్ తో మన దగ్గర సహా పాన్ ఇండియా మార్కెట్ లో ఒక మాస్ సినిమాతోనే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓటిటి లో హిట్ కావడం ఇక వాటి నుంచి మళ్ళీ చాలా తర్వాత ఒక పక్కా మాస్ సినిమా “ఈటి” తో వస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే సూర్య కూడా మరిన్ని జాగ్రత్తలు ఈ సినిమాకి తీసుకుంటున్నాడు. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టెప్ అది కూడా చాలా ఏళ్ళకి తీసుకోవడం ఆసక్తిగా మారింది.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి గాను సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డబ్బింగ్ నుంచి నేరుగా ఫోటోనే బయటకి వచ్చి వైరల్ అవుతుంది. అయితే ఇది వరకే సూర్య గతంలో తన ప్రయోగాత్మక చిత్రం “బ్రదర్స్” కి డబ్బింగ్ చెప్పుకున్నారు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రం చెప్పుకోవడం విశేషం. మరి మళ్ళీ ఇన్నాళ్లకు సూర్య తెలుగు వాయిస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :