ముగ్గురు ‘ఆర్’ ల మరో ప్రపంచ బాక్సాఫీస్ బీభత్సం కోసం గెట్ రెడీ.!

Published on Jul 15, 2021 11:24 am IST

ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం నుంచి ఎన్నో అంచనాలు రేకెత్తిస్తూ మేకర్స్ విడుదల చేస్తామన్న మేకింగ్ వీడియో ఇప్పుడు బయటకి వచ్చేసింది. వేరే లెవెల్లో అంచనాలు ఏర్పర్చుకుని విడుదల కాబడ్డ ఈ మేకింగ్ వీడియో మొదటి నుంచి వారు చెప్తున్నట్టుగానే ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి అంతకు మించే ఇది ఉంటుంది అని చెప్పిన దానికంటే ఎక్కువే ఈ వీడియోలో ఉందని చెప్పాలి.

రెండు నిమిషాల లోపు కట్ చేసిన ఈ సాలిడ్ మేకింగ్ వీడియో కట్ లోనే ఎన్నో ఫ్రేమ్స్ చూపించి రాజమౌళి మరిన్ని అంచనాలు పెంచారు. ఆనతి భారీ సెట్టింగ్ లు తారక్,చరణ్ ల పాత్రల నీరు, నిప్పు ప్రతీకలతో ఒక లెక్కలో విజువల్స్ తో డిజైన్ చేశారు. అతి ముఖ్యంగా ఈ వీడియోలో లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింప్లి అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి.

అలాగే ఈ మేకింగ్ పై డిజైన్ చేసిన ర్యాప్ సాంగ్ దానికి తగ్గట్టుగా బీట్స్ అయితే ఓ రేంజ్ లో మ్యూజిక్ లవర్స్ కి అనిపిస్తాయి. అలాగే కీరవాణిలో ఈ కోణం కూడా ఖచ్చితంగా ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగే సినిమాలో శ్రేయ, సముథిరకని, హాలీవుడ్ నటుల సాలిడ్ విజువల్స్ కూడా ఇందులో చూపారు. అలాగే లాస్ట్ లో చరణ్, తారక్, ఆలియా, అజయ్ దేవగన్ ల విజువల్స్ మరో హైలైట్..

మొత్తంగా మాత్రం రామారావు, రామ్ చరణ్ లతో రాజమౌళి కలిపి స్టార్ట్ చేసిన ఈ మహాయాగం స్టార్టింగ్ “RRR” అనే టైటిల్ కి ఎలా సార్ధకం చేసారో ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు ఆర్ ల సరికొత్త ప్రపంచం ఇండియన్ సినిమా ఖ్యాతిని మరోమారు ఎల్లలు దాటించడం ఖాయం అనిపిస్తుంది. అలాగే ఈ సరికొత్త ప్రపంచాన్ని వచ్చే అక్టోబర్ 13నే విట్నెస్ చేయనున్నామని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు.. సో గెట్ రెడీ..

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :