ఏడాది గడిచినా వీడని సుశాంత్ మరణం మిస్టరీ.!

Published on Jun 14, 2021 11:00 am IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణంతో గత ఏడాది ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. అప్పటికే పలువురు లెజెండరీ నటులను కోల్పోయిన ఇండియన్ సినిమా సుశాంత్ మరణంతో నివ్వెరపోయింది. “ఎం ఎస్ ధోని” సినిమాలో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ గత ఏడాది జూన్ లో ఇదే రోజున మరణించాడని బయటకొచ్చిన వార్త చాలా మంది మనసుని కూడా విరిచేసింది.

అయితే నేటితో ఏడాది పూర్తి కావడంతో సుశాంత్ మరణంపై ఇంకా ఒక అర్ధం దొరకకపోవడంతో మరోసారి ఆ టాలెంటెడ్ చాంప్ ని తలచుకొని అభిమానులు సహా కుటుంబ సభ్యులు కూడా తలుచుకుని బాధ పడుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఇంకా ఏమిటీ అన్నది తేలకపోవడం మరింత విషాదకరం. ఇదే వారిని ఈరోజున మరింత బాధ పెడుతుంది. దీనితో సోషల్ మీడియాలో అనేకమంది నెటిజన్స్ తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :