ఆల్ టైం లిస్ట్ లోకి నిన్న ప్రభాస్ ఈరోజు అనుష్క.!

Published on Jun 3, 2021 5:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్కల జంటకు ఉన్న క్రేజ్ నే వేరు ఇది అందరికీ తెలుసు. మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ జంటల్లో వీరిది కూడా ఒకటి. మరి ఇలాంటి ఆల్ టైం ఫేవరెట్ జంట అయినటువంటి వీరిలో నిన్న 2020 టైమ్స్ నుంచి వచ్చిన ఆల్ టైం ఫరెవర్ డిజైరబుల్ మెన్స్ లిస్ట్ లో ప్రభాస్ పేరు మొట్ట మొదట సారి చోటు దక్కించుకోగా..

మళ్ళీ ఈ ఒక్కరోజు వ్యవధిలోనే స్వీటీ అనుష్క పేరు కూడా ఉమెన్స్ క్యాటగిరీలో ఫరెవర్ డిజైరబుల్ సెలెబ్రెటీగా లేటెస్ట్ ఎంట్రీ ద్వారా నిలిచింది. దీనితో చాలా కాలం అనంతరం మళ్ళీ స్వీటీ పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఇలా ఒక్కరోజులోనే వీరిద్దరి పేర్లు యాడ్ అవ్వడంతో మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తుండగా అనుష్క తన న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనుంది.

సంబంధిత సమాచారం :