పుష్ప రూట్ లోనే సలార్ కూడా !

Published on Jun 21, 2021 1:00 pm IST

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో “సలార్” సినిమా వస్తోంది అనగానే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్ తన కేజీఎఫ్ సినిమా లానే .. స‌లార్ ని కూడా రెండు భాగాలుగా విడుద‌ల చేయాలనే ఆలోచ‌నలో ఉన్నారట, ప్ర‌స్తుతం ఇదే విషయం పై ప్రభాస్ – ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట.

ప్రభాస్ ఒప్పుకుంటే సలార్ కూడా రెండు భాగాలుగా బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. స‌లార్‌ ప్రారంభించే ముందు స్క్రిప్ట్ ను ఒక పార్ట్ కి అనుకునే రాసుకున్నారు. మరి మధ్యలో స్క్రిప్ట్ మారిస్తే కథలో పట్టు కోల్పోతారేమో. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే శ్రుతి హాసన్ ఈ సినిమా వచ్చే షెడ్యూల్ షూట్ లో పాల్గొనబోతుంది. ఒక జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హాసన్ ఈ సినిమాలో కనిపించబోతుంది. ఈ సినిమాని త్వరగా పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

సంబంధిత సమాచారం :