ఇంటర్వ్యూ: షకలక శంకర్ – స్టార్ కాదు కానీ ఒక మంచి నటుడని అనిపించుకుంటాను !

ఇంటర్వ్యూ: షకలక శంకర్ – స్టార్ కాదు కానీ ఒక మంచి నటుడని అనిపించుకుంటాను !

Published on Jun 28, 2018 4:51 PM IST

కమెడియన్ గా మంచి స్థాయిలో ఉంటూనే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షణించుకోదానికి ‘శంభో శంకర’ సినిమా చేశారు షకలక శంకర్. ఈ సినిమా రేపే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయం మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఉన్నపళంగా హీరో ఎందుకు అయ్యారు ?
కమెడియన్ గా నా స్థాయికి తగిన, నాన్నను సంతృప్తిపరచగల పాత్రలు రావడం లేదు. అందుకే హీరోను అయ్యాను. అంతేగాని ఏదో ఉద్దరించేద్దామనే ఉద్దేశ్యంతో కాదు.

ఈ కథతో త్రివిక్రమ్, దిల్ రాజుగార్ల దగ్గరికి ఎందుకు వెళ్లారు ?
ఎందుకంటే కొంత డబ్బు పెడితే పదిమంది బ్రతుకుతారనే ఉద్దేశ్యంతో వాళ్ళ వద్దకు వెళ్ళాను. వాళ్ళూ ఎంకరేజ్ చేశారు. కానీ వాళ్లకు నాకు టైమింగ్ కుదరలేదు అంతే.

మరి మీ గురువుగారు ఆర్జీవీ వద్దకు వెళ్ళొచ్చుగా ?
ఆయనే హిట్ కొట్టలేకపోతున్నారు. ఇక ఆయన దగ్గర నేనేం చేస్తాను. ఆయనొక హిట్ కొడితే బాగుంటుందని నాకూ అనిపిస్తుంటుంది.

సినిమా మొదలయ్యాక త్రివిక్రమ్, దిల్ రాజుగారిని కలిశారా ?
కలిసాయిను. దిల్ రాజు, వినాయక్ గార్లు పాటల్ని, హరీష్ శంకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ గారిని కలుద్దామనుకుంటే ఆయన ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వలన కుదరలేదు.

ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే మీ భవిష్యత్తు దెబ్బ తినదా ?
అంటే ఒక్క సినిమాతోనే ఒకరి భవిష్యత్తు తెలిపోదు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఫ్యూచర్ ఉండదు అనుకుంటే ఈరోజు చాలా మంది హీరోలు ఉండరు. ప్లాప్ వచ్చినా నిలబడగల ధైర్యం మనలో ఉండాలి.

ఈ కథ నచ్చడానికి కారణం ఏమిటి ?
అంటే ఈ కథని మొదటి నుండి నేను, డైరెక్టర్ శ్రీధర్ కలిసే తయారుచేసుకున్నాం. అంటే కథ అతనిదే, దాన్ని ఇద్దరం కలిసి డెవలప్ చేశాం. ఒక రకంగా నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోవచ్చు.

సినిమా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఎందుకొచ్చింది ?
అది నాక్కూడా తెలీకుండా వచ్చింది. కావాలని చేసుంటే అది ఇమిటేషన్ అయ్యుండేది. కానీ సినిమాలో అలా లేదు. చాలా మంది బాగా చేశావని మెచ్చుకున్నారు.

ఈ సినిమాతో ఒక స్టార్ అవుతారా ?
స్టార్ కాదు కానీ ఒక మంచి నటుడ్ని అవుతానని మాత్రం చెప్పగలను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు