“వకీల్ సాబ్” దెబ్బతో ఈ క్రేజీ రీమేక్ పై పెరిగిన అంచనాలు.!

Published on Apr 12, 2021 9:00 am IST

మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాస్ హిట్ కొడితే చూడాలని చాలా మందే కోరుకోగా దానిని లేటెస్ట్ “వకీల్ సాబ్” తో ఫుల్ ఫిల్ చేసేసారు. ఒక్క సబ్జెక్టు పరంగానే కాకుండా నటనలో కూడా పవన్ కు ఈ చిత్రం మరో స్థాయిదే అని చెప్పాలి. మరి అందుకు మొదట క్రెడిట్ దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఇవ్వాల్సిందే. పింక్ అనే కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టును పవన్ స్టార్డం కు తగ్గట్టుగా ఎక్కడా చెక్కు చెదరకుండా తెరకెక్కించి మెప్పించడం అన్నది సామాన్య విషయం కాదు.

ఇది వరకు పవన్ రీమేక్స్ ఒప్పుకుంటుంటుంటే అంత స్టార్ హీరో అయ్యి ఉండి ఈ రీమేక్స్ చేసుకోవడం ఏంటి అని అంతా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నిటికి భిన్నంగా వకీల్ సాబ్ అదరగొట్టింది. దీనితో ఇప్పుడు పవన్ చేస్తున్న మరో క్రేజీ రీమేక్ “అయ్యప్పణం కోషియం” పై మరో లెవెల్ అంచనాలు సెట్టయ్యాయి. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సబ్జెక్టును ఎలా డీల్ చేస్తాడా అన్నది మంచి ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మారింది.

ఇది కూడా కథ పరంగా ఎక్కడా తగ్గనిది పైగా పవర్ ఫుల్ గా ఉంటుంది. దీనికి మరి ఎలాంటి అనుగుణమైన మార్పులు చేర్పులు చేశారు అన్నది చూడాలి. ఇంతకు ముందే వకీల్ సాబ్ కన్నా ఎక్కువ అంచనాలు ఏర్పర్చుకున్న చిత్రం ఇది. కానీ ఇప్పుడు ఇదే వకీల్ సాబ్ మూలాన మరింత అంచనాలు పెంచుకున్నదిగా మారింది. మరి ఈ చిత్రాన్ని సాగర్ అండ్ టీం ఎలా డీల్ చేస్తున్నారో తెలియాలి అంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :