ఇక ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ మ్యాజిక్ చేయాల్సిందే!

ఇక ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ మ్యాజిక్ చేయాల్సిందే!

Published on Nov 26, 2026 12:12 PM IST

ఈ డిసెంబర్ నెల ఆరంభం తోనే మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ సిద్ధంగా ఉంది. ఇద్దరు ప్రముఖ యువ హీరోలు తమదైన శైలి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యారు. వారిలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం ‘వృషకర్మ’ నుంచి వచ్చిన ట్రైలర్ అందరిలో మంచి ఆసక్తి రేకెత్తించింది.

ఇక ఇప్పుడు అందరి కళ్ళు నితిన్ సినిమా అలియాస్ రుక్మిణీ ట్రైలర్ పై పడ్డాయి. అలియాస్ రుక్మిణీ సినిమా ట్రైలర్ కూడా నేడే విడుదల కానుంది. సో ఈ ట్రైలర్ కూడా గట్టి మ్యాజిక్ చేస్తే గాని వృషకర్మ కి ధీటుగా నిలిచే అవకాశం ఉంటుంది. మరి మేకర్స్ ఎలాంటి ట్రైలర్ ని ఈ సాయంత్రం వదులుతారా అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మురళికాంత్ దేవసోత్ పని చేయగా డిసెంబర్ 4నే రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

తాజా వార్తలు