ఈ ఓటిటిలోకి వచ్చేసిన ‘గరివిడి లక్ష్మి’!

ఈ ఓటిటిలోకి వచ్చేసిన ‘గరివిడి లక్ష్మి’!

Published on Nov 26, 2026 9:01 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ఆనంది అలాగే రాగ్ మయూర్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు జమ్మి నాయుడు గౌరీ తెరక్కేకించిన లేటెస్ట్ సినిమానే ‘గరివిడి లక్ష్మి’. మంచి ప్రమోషన్స్ ని విడుదలకి ముందు చేస్తూ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఉత్తరాంధ్ర ప్రముఖ బుర్రకథ గాయకురాలు గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు పాపులర్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నేటి నుంచి ఇందులో పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. సో ఈ సినిమాని మిస్ అయ్యినవారు ఇందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించగా షకలక శంకర్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు