ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

Published on Nov 26, 2026 8:03 AM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి ఓ సర్ప్రైజింగ్ కాంబినేషన్ అనౌన్సమెంట్ ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో ప్రకటించిన సినిమానే అని చెప్పాలి. ఒక్కసారిగా క్రేజీ హైప్ ని తెలుగు ఆడియెన్స్ లో సెట్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా అనీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటున్నారో అన్నీ ఉంటాయని, మాస్ ఆడియెన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ముఖ్యంగా దాదాపు పదేళ్లగా ఎన్టీఆర్ నుంచి మిస్సవుతున్న కామెడీ యాంగిల్ ని కూడా ఇందులో చూపించబోతున్నట్టు తాను తెలిపాడు. పైగా ఎన్టీఆర్ స్కేల్ కి తగ్గట్టుగానే ఉంటుంది అని చెప్పడం మరో విశేషం. దీనితో ఈ కాంబినేషన్ పై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి.

తాజా వార్తలు