బంపర్ ప్రైజ్ పలికిన మహేష్ ‘ఆగడు’ శాటిలైట్ రైట్స్

Published on Jun 6, 2014 9:35 am IST

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘ఆగడు’ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. జెమిని టీవీ వారు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని 9.75 కోట్లకి కొనుక్కున్నారు.

కేవలం ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేసిన ఈ సినిమాకి ఇంత రేటు పలకడానికి కారణం సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండడమే అని సమాచారం. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ వివాదంలో ఇరుక్కోవడంతో పాటు మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది.

మొదటి సారి ఈ మూవీలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :