పవన్ క్రేజీ కాంబోపై మళ్లీ వినిపిస్తున్న బజ్.!

Published on Jun 3, 2021 7:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలను టేకఫ్ చేసి ఏకకాలంలో రెండు మూడు సినిమాల షూట్ లో పాల్గొంటున్నారు. మరి ఇటీవల కరోనా బారిన పడినా మళ్లీ కోలుకుని షూట్ కి సన్నద్ధం అయ్యారు. అయితే అలా ఇప్పటి వరకు కన్ఫర్మ్ గా నాలుగు ప్రాజెక్ట్ లు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మరి వీటితో పాటుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ పై మళ్లీ బజ్ మొదలైంది..

అదే పవన్ మరియు పూరి జగన్నాథ్ ల కాంబో.. ఈ ఇద్దరి సినిమా అంటే స్పెషల్ క్రేజ్ టాలీవుడ్ లో ఉంది. మరి ఈ ఇద్దరి నుంచి మరో సినిమా ఉండనుంది అని లేటెస్ట్ గా టాక్ ఊపందుకుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆల్రెడీ ఈ సినిమా కోసం లైన్ లో ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అసలు ఉందో లేదో మళ్లీ కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :