బన్నీ ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ.!

Published on Apr 17, 2021 7:20 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఏది అంటే ఇప్పుడు “పుష్ప” సినిమానే అని అంతా చెప్తారు. అయితే సుకుమార్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం మొదట పాన్ ఇండియన్ సినిమాగా అనుకోలేదు తర్వాత పరిణామాలు మారాయి. కానీ బన్నీ మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఏది అని తన కల్ట్ ఫ్యాన్స్ కు మాత్రం బాగా తెలుసు.

అదే “ఐకాన్”, దర్శకుడు శ్రీరామ్ వేణు తో ఎప్పుడో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రారాజు అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుష్ప బన్నీ మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా లైన్ లోకి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మళ్ళీ గట్టిగా వినిపిస్తున్న ఈ సినిమాపై దిల్ రాజు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా ఉందని దానిని శ్రీరామే తెరకెక్కిస్తాడని తెలిపారు. మై బహుశా ఈ చిత్రం “పుష్ప” తర్వాతనే ఉండొచ్చేమో చూడాలి.

సంబంధిత సమాచారం :