“RRR” పై మరోసారి కన్ఫర్మేషన్.!

“RRR” పై మరోసారి కన్ఫర్మేషన్.!

Published on Jul 3, 2021 8:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన పలు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఇటీవలే షూట్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ గానే ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా బ్యాలన్స్ షూట్ అండ్ రిలీజ్ డేట్ పై మళ్ళీ సమాచారం తెలుస్తుంది. దాని ప్రకారం ప్రస్తుతం స్వల్ప విరామంలో ఉన్న చిత్ర యూనిట్ మళ్ళీ వచ్చే జూలై 10 నుంచి షూట్ స్టార్ట్ చేయనున్నారట. ఆ షూట్ ఆగష్టు వరకు ఉంటుందని తెలుస్తుంది.

అలాగే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దశల వారీగా శరవేగంగా జరుగుతుండగా మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోని అక్టోబర్ 13 నాటికే సినిమా విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సో రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు అని మరోసారి కన్ఫర్మ్ అయ్యినట్టే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు