వైరల్ అవుతున్న మహేష్ మరో లేటెస్ట్ లుక్స్.!

Published on Jan 14, 2021 8:00 am IST

మన టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ కూడా ఒకరు. ప్రతీ సారి కూడా తన కొత్త సినిమాలలో స్టన్నింగ్ అండ్ యంగ్ లుక్స్ తో అదరగొడుతూనే ఉంటారు. మరి అలాగే తాను ఇప్పుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట”కు కూడా వింటేజ్ లుక్ ను ప్రిపేర్ చేస్తూ తన ఫాన్స్ కు మరింత కిక్కివ్వడానికి రెడీ అవుతున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో మహేష్ తాలూకా కొన్ని లుక్స్ బయటకు వస్తున్నాయి. వాటిలో మంచి హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా కనిపించి ప్రతీ సారి తన లుక్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. మరి అలా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మహేష్ తాలూకా మరిన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సరికొత్త యాడో ఏమో కానీ అందులో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ సర్కారు వారి పాట పై మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న మహేష్ ఈ ఫోటోలు ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ లో జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది.

సంబంధిత సమాచారం :

More