మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. అయితే సంక్రాంతి వీక్ లో అదరగొట్టిన ఈ సినిమా ఆ తర్వాత వారంలో కొంచెం నెమ్మదించింది. సోమవారం మంచి వసూళ్లు అందుకుంది కానీ ఆ తర్వాత కొంచెం స్లో అయ్యింది.
కానీ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఊపందుకుంది. ఆల్రెడీ నిన్న శుక్రవారం సాయంత్రం షోస్ నుంచే సాలిడ్ జంప్ ని అందుకోగా ఈ లాంగ్ వీకెండ్ పై ఈ సినిమా కన్నేసింది. సో వరుసగా ఈ మూడు నాలుగు రోజులు మంచి వసూళ్లనే ఈ సినిమా అందుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ సాలిడ్ కామియో రోల్ లో నటించగా భీమ్స్ సంగీతం అందించారు. అలాగే సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.
