బన్నీ బాయ్ గోల్డెన్ హార్ట్..ఈ సాయం కూడా చేసాడట.!

Published on Sep 14, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్” ని ముగించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ షూట్ లో భాగంగా ఇటీవల కాకినాడ వెళ్లిన బన్నీ మధ్యలో ఒక రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ లో అల్పాహారం భుజించడం హాట్ టాపిక్ గా మారింది. బన్నీ సింప్లిసిటీ కి ఇది మరో నిదర్శనం కాగా వారికి అయ్యిన బిల్ కంటే ఎక్కువ కట్టడం వైరల్ అయ్యింది.

అయితే బన్నీ గోల్డెన్ హార్ట్ ఏంటో మళ్ళీ ప్రూవ్ అయ్యినట్టు తెలుస్తుంది. బన్నీ ఆ దుకాణం యజమానితో మాట్లాడి అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట. దీనితో బన్నీ ఉదారత మరోసారి బయట పడింది. మరి ప్రస్తుతం బన్నీ అయితే పుష్ప ని కంప్లీట్ చేసే పనిలో ఉండగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :