“వకీల్ సాబ్” ది బెస్ట్ వర్క్ గా మళ్లీ ప్రూవ్ అయ్యింది..!

Published on Jun 6, 2021 8:36 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా కాలం అనంతరం పవన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టే పవన్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించారు.

అయితే ఈ చిత్రం నిజానికి బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” రీమేక్ అని తెలిసిందే.. అక్కడ రీమేక్ కాబడిన ఈ చిత్రం తమిళనాట థలా అజిత్ హీరోగా “నెర్కొండ పారవై” గా రీమేక్ అయ్యింది. తర్వాత మరిన్ని మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అయితే పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ మార్పులు చేసిన మేకర్స్ విడుదల అయ్యాక ఆ సక్సెస్ ను టేస్ట్ చేశారు. ప్రశంసల రూపంలో హిందీ మరియు తమిళ్ వెర్షన్స్ కంటే బెటర్ అని అప్పుడే టాక్ తెచ్చుకుంది..

మరి అలానే కాకుండా మరోసారి కూడా ఈ మూడింటిలో వకీల్ సాబ్ నే బెస్ట్ వర్క్ అని మరోసారి కూడా ప్రూవ్ అయ్యింది. ఐ ఎం డి బి లో ఈ మూడు చిత్రాల్లోకల్లా వకీల్ సాబ్ నే బాగుందని సినీ ప్రేమికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వగా ఈ చిత్రం హైయెస్ట్ రేటెడ్ చిత్రంగా నిలిచింది.. దీనితో వకీల్ సాబ్ ఈ ఫీట్ ను కూడా సాధించింది అని ఈ చిత్రానికి ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు.. ఇక ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో నటించగా దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :