“పుష్ప” రాజ్ మళ్ళీ యాక్షన్ తోనే స్టార్ట్ చేసారా?

“పుష్ప” రాజ్ మళ్ళీ యాక్షన్ తోనే స్టార్ట్ చేసారా?

Published on Dec 17, 2020 10:25 AM IST

Pushpa

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇక అలాగే ఈ ఇప్పటికే చాలా మేర షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల అనేక అడ్డంకులను దాటుకొని రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. అయితే ఈ భారీ చిత్రంలో మొట్ట మొదటిగా భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ షూట్ లో పాల్గొన్నారు. అయితే దాని తర్వాత కూడా మారేడుమిల్లి అడవుల్లో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత మళ్ళీ స్వల్ప విరామం ఇచ్చాక మళ్ళీ షూట్ ను యాక్షన్ పార్ట్ తోనే స్టార్ట్ తెలుస్తుంది.

ఈసారి హైదరాబాద్ లో వేసిన సెట్లో విలన్ గ్యాంగ్ తో కలిసి ఉండే ఒక సీన్ లో బన్నీ పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి సుకుమార్ మొదటగా ఈ సన్నివేశాలనే కంప్లీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యినట్టు ఉన్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు