మరోసారి మొదలైన “ఫ్యామిలీ మ్యాన్ 2” రగడ.!

Published on Jun 6, 2021 3:00 pm IST

గత కొన్నాళ్లుగా ఇండియన్ ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2” ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కి వచ్చేసింది. స్టేర్ హీరోయిన్ సమంతా స్ట్రాంగ్ నెగిటివ్ రోల్ లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ వచ్చిన కొత్తలోనే తమిళ ఆడియెన్స్ నుంచి విపరీతమైన నెగిటివిటి తెచ్చుకుంది.

దీనితో ఈ సిరీస్ రిలీజ్ వరకు కూడా మేకర్స్ నుంచి పెద్దగా ప్రమోషనల్ పోస్ట్స్ పడలేదు. కానీ ఫైనల్ ఈ సీజన్ రిలీజ్ అయ్యి యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ రెండు రోజులు బాగానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ లో నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. ప్రైమ్ వీడియోని బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 2 తమిళులకు వ్యతిరేఖంగా ఉందని రచ్చ నడుస్తుంది. ఎల్ టి టి ఈ పై చూపిన పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని నిజానికి ఇందులో చూపినట్టు ఉండవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఫోన్స్ లో చాలా మంది ప్రైమ్ వీడియోని తీసేస్తున్నామని కూడా అంటున్నారు. మరి మళ్ళీ ఇదంతా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :