తేజ దర్శకత్వం వెంకటేష్ నటించబోయే సినిమా ఈ నెల 12 న మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు హీరోయిన్ ఇషా రెబ్బ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు లక్ష్మి భూపాల్ మాటలు రాస్తున్నారు. గతంలో లక్ష్మి భూపాల్, తేజ నేనేరాజు నేనేమంత్రి సినిమాకు వర్క్ చేసారు. ఆ సినిమాలోని మాటలు టూటాల్లా పేలాయి. మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడం విశేషం.
దాదాపు కొత్తవాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఆడిషన్స్ చేసి నూతన నటినటుల్ని ఎంచుకోవడం జరిగింది. తమిళ్ కెమెరామెన్ రామానుజం ఈ సినిమాకు వర్క్ చెయ్యబోతున్నాడు. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతుండడం విశేషం.


