బన్నీ మాస్ కాంబోకి మళ్ళీ వారే.!

Published on Jun 12, 2021 8:09 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాల్లో మాస్ లో విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చిన చిత్రం “సరైనోడు”. మరి ఆ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మళ్ళీ అల్లు అర్జున్ కాంబో రిపీట్ కానుంది అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అయితే మరి ఆ టాక్ నిజమే అని ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సాలిడ్ మాస్ కాంబోపై మరో ఇప్పుడు వినిపిస్తుంది.

గత సరైనోడు సినిమాని ఎవరైతే నిర్మాణం వహించారో ఈసారి ఈ చిత్రాన్ని కూడా వారే నిర్మాణం వహించిననున్నట్టు తెలుస్తుంది. అదే “గీతా ఆర్ట్స్” సంస్థ వారు. బన్నీ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ఒకటి ఉంది. సో ఈ సక్సెస్ ఫుల్ కాంబో నుంచి మరో సాలిడ్ హిట్ లోడ్ అవుతున్నట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :