“దంగల్” డైరెక్టర్ లాంచ్ చేస్తున్న తెలుగు మూవీ ట్రైలర్.

Published on Jun 6, 2019 1:50 pm IST

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరోహీరోయిన్లుగా స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. కామెడీ స్పై థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.ఈ మూవీ జూన్ 21న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఐతే ఈ మూవీ టీజర్ బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి చేతుల మీదుగా రేపు సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది. అమీర్ ఖాన్ హీరో గా నితీష్ తివారి తీసిన స్పోర్ట్స్ బయో పిక్ “దంగల్”,ఇండియన్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. చైనా లో ఈ మూవీ 1000 కోట్ల పైగా వసూళ్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ళలో “బాహుబలి2” ని కూడా మించి పోయింది. అంత ప్రముఖ డైరెక్టర్ ఓ చిన్న తెలుగు సినిమా ట్రైలర్ ని లాంచ్ చేయడంతో ఈ విషయం ప్రాధ్యాత సంతరించుకొంది.

సంబంధిత సమాచారం :

More