‘అజ్ఞాతవాసి’ మొదటిరోజు ఏపి, తెలంగాణ వసూళ్లు !

11th, January 2018 - 06:18:13 PM

తారాస్థాయి అంచనాల నడుమ పవన్ సిల్వర్ జూబ్లీ చిత్రం ‘అజ్ఞాతవాసి’ నిన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఎక్కువ మొత్తం థియేటర్లలో రిలీజవడం వలన సినిమా మొదటిరోజు రికార్డ్ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఏపి, తెలంగాణల్లో కలిపి రూ. 26. 93 కోట్లను వసూలు చేసింది.

దీంతో చిరు ‘ఖైదీ నెం 150’ పేరిట ఉన్న రూ.23.30 కోట్ల రికార్డును దాటేసి ‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో నిలబడింది. ఇక ఏరియాల వారీగా వసూళ్ల వివరాల్ని చూస్తే ..

ఏరియా కలెక్షన్లు
నైజాం    5. 45 కోట్లు
సీడెడ్ 3.35 కోట్లు
నెల్లూరు 1.64 కోట్లు
గుంటూరు 3.78 కోట్లు
కృష్ణా 1.83 కోట్లు
వెస్ట్ 3.70 కోట్లు
ఈస్ట్ 2.85 కోట్లు
ఉత్తరాంధ్ర 4.30 కోట్లు
మొత్తం 26.93 కోట్లు