ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా “ఆహా భోజనంబు” సరికొత్త ప్రోమో!

Published on Sep 2, 2021 1:15 am IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఆహా వీడియో ఆహా భోజనంబు అంటూ ఒక కార్యక్రమం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మంచు లక్ష్మీ. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఏడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను ఆహా వీడియో తాజాగా విడుదల చేయడం జరిగింది.

ఈ ఎపిసోడ్ కి సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ గా రావడం జరిగింది. సాంబార్ అల్ఫా అల్ఫా, అరటిపండు లంబా లంబా, బంగళా బౌ భౌ లాంటి వంటకాలు చేస్తా అంటూ సిద్దు ప్రోమో లో చెప్పుకొచ్చిన మాటలు ఫన్ కౌంటర్ లా అనిపిస్తాయి. ఈ కార్యక్రమం కి సంబంధించిన పూర్తి ఎపిసొడ్ సెప్టెంబర్ మూడవ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ను ఆహా వీడియో షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :