మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తాజా కార్యక్రమం ఆహా భోజనంబు. ఈ కార్యక్రమం ఆహా వీడియో లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీ లతో ఆహ్లాదకరమైన చర్చలు జరుపుతూ వంటలతో అలరిస్తున్న ఆహా భోజనంబు ఇప్పుడు సరికొత్త గెస్ట్ లతో అలరించేందుకు సిద్దం అయ్యింది.
ఈ వారం మేఘా ఆకాష్ మరియు అదిత్ లు ఆహా భోజనంబు కార్యక్రమానికి అతిథులు గా వచ్చి అలరించారు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరో అదిత్ వంట లో వాసన చూసి ఉప్పు లేదు అని అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఫన్ ఇచ్చే విధంగా ఉన్నాయి. మేఘా ఆకాష్ మరియు అదిత్ లతో మంచు లక్ష్మి చేసిన ఈ కార్యక్రమం కి సంబంధించిన పూర్తి ఎపిసొడ్ ఆగస్ట్ 27 వ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది.
https://twitter.com/ahavideoIN/status/1430478403199660032?s=20
