తమిళ్ లో గ్రాండ్ గా లాంఛ్ అవుతున్న ఆహా వీడియో!

Published on Apr 14, 2022 10:00 pm IST


ఓటిటి రంగం రోజురోజుకీ పెరిగిపోతోంది. మంచి సినిమాల నుండి వెబ్ సిరీస్ లు సైతం ఈ ఓటిటి ప్లాట్ ఫాం లలో ఆడియెన్స్ కి అందుబాటులో ఉంటున్నాయి. తెలుగు లో ఆ రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఓటిటి ఏదైనా ఉంది అంటే అది ఆహా వీడియో అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్న ఈ ఆహా వీడియో, ప్రస్తుతం తమిళ్ ప్రేక్షకులని అలరించడానికి సిద్దం అవుతుంది.

తమిళ్ లో ఈ ఆహా వీడియో గ్రాండ్ గా లాంఛ్ కానుంది. నేడు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గ్రాండ్ లాంఛ్ వేడుక కి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తమిళ్ సిని అభిమానుల కోసం ఆహా వీడియో చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :