అర్జున్ ‘మీటూ’ వ్యవహారం పై స్పందించిన ‘అర్జున్ కుమార్తె’ !

Published on Oct 22, 2018 4:53 pm IST

సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం రోజుకొక రకంగా మలుపు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనలు మరియు వేధింపులను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. అయితే హీరోయిన్ శృతి హరిహరన్, సీనియర్ హీరో అర్జున్ తనతో షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. తన వెనుక భాగాన్ని తాకి తనను బాగా ఇబ్బంది పెట్టాడని.. తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కాగా, శృతి హరిహరన్ చేసిన ఆరోపణలు పై అర్జున్ స్పందిస్తూ… తాను ఇప్పటివరకు సుమారు అరవై మంది టాప్ హీరోయిన్లతో కలిసి నటించానని, ఎప్పుడూ ఎవరు తనపై ఇలాంటి అభ్యంతరకరమైన ఆరోపణలు చెయ్యలేదని.. దీని బట్టి నేనంటో అర్ధం చేసుకోవాలని తెలిపారు. ఇక తాజాగా అర్జున్ కుమార్తె ‘ఐశ్వర్య అర్జున్’ కూడా తన తండ్రికి సపోర్ట్ చేస్తూ.. ఆయన పై శృతి అనవసరమైన మరియు అవాస్తవమైన ఆరోపణలు చేసిందని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :