‘అరుంధతి’ రీమేక్ పై ఐశ్వర్య రాయ్ ఆసక్తి..!

‘అరుంధతి’ రీమేక్ పై ఐశ్వర్య రాయ్ ఆసక్తి..!

Published on Jul 23, 2014 11:06 AM IST

Aishwarya-Rai_Arundhati

అనుష్క ప్రధాన పాత్రలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్రాఫిక్ బేస్డ్ ఫాంటసీ మూవీ ఎంతటి ఘన విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడానికి మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఆసక్తి చూపిందట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు కోడి రామకృష్ణ వెల్లడించారు.

తెలుగులో 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన అనుభవం కోడి రామకృష్ణకు ఉంది. తెలుగులో అగ్ర హీరోలందరితోను పని చేసిన ఈ దర్శకుడు హిందీలో ఐశ్వర్య రాయ్ ను దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆమెను కలసి రెండు మూడు కథలు కూడా చెప్పారు. ఐశ్వర్య ‘అరుంధతి’ రీమేక్‌ పట్ల ఆసక్తి ప్రదర్శించింది. అయితే ‘అరుంధతి’ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదల కావడంతో కొత్త కథతో సినిమా చేయాలని కోడి రామకృష్ణ భావిస్తున్నారు. ఒకవేళ కొత్త కథలు ఐశ్వర్యకు నచ్చకపోతే ‘అరుంధతి’ చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు