మోహన్ బాబు భార్యగా ఐశ్వర్యరాయ్

మోహన్ బాబు భార్యగా ఐశ్వర్యరాయ్

Published on May 17, 2019 12:00 AM IST

తెలుగు సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు దర్శకుడు మణిరత్నం చేయనున్న హిస్టారికల్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు భార్యగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ నటించనుందట. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ చిత్రం తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందనుంది.

ఇందులో ఐశ్వర్య నందిని అనే కీలకమైన పాత్రను చేయనుంది. ఈ పాత్ర రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉంటుందట. అంటే ఒక రకంగా ప్రతినాయిక పాత్రన్నమాట. చాలా రోజుల క్రితమే మణిరత్నం నుండి కథను విన్న ఐశ్వర్య బాగా ఆలోచించి సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు కూడా నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు