ఇంటర్వ్యూ :- ఐశ్వ‌ర్యా రాజేష్‌ – కథకు నీడ్ అయితే లిప్ లాక్ పెట్టడంలో తప్పేం లేదు.

Published on Jan 31, 2020 6:11 pm IST

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్స్‌ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సంధర్భంగా ఐశ్వ‌ర్యా రాజేష్‌ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

మీ మదర్ టంగ్ తెలుగు. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ?

ఈ సినిమా నా ఫస్ట్ తెలుగు సినిమా, అంటే నేను తెలుగులో ఫస్ట్ సైన్ చేసిన సినిమా ఇదే. తెలుగు నా మదర్ టంగ్, ఇక్కడ సినిమాలు చేయాలని బాగా ఇంట్రస్ట్ ఉండేది, కానీ ఇక్కడి సినిమాల గురించి పెద్దగా తెలియదు, ఎవర్ని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అలాంటి టైంలో విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ అని ఈ ఆఫర్ వచ్చింది. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నందుకు చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.

 

ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది. అలాగే కథలో మీ పాత్ర గురించి ?

మిర్చి అవార్డ్స్ ఫంక్షన్ కి 2018లో హైదరాబద్ వచ్చిన సమయంలో మా డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారి నాకు ఈ కథ చెప్పారు. నాకు చాల బాగా నచ్చింది. కథ విన్న వెంటనే నేను ఆయనతో అన్న మాట.. ఈ పదేళ్లలో ఇలాంటి క్యారెక్టర్ ను నేను ఏ సినిమాలో చూడలేదని చెప్పాను. నిజంగా సినిమాలో నా క్యారెక్టర్ చాల బాగుంది. మంచి ఎమోషనల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, చాల డెప్త్ ఉంటుంది. నాకు బాగా కనెక్ట్ అయింది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

 

సినిమాలో మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ?

సినిమాలో అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది అండి. ఇక నాది మెయిన్ పాత్రనా ? రాశిది మెయిన్ పాత్రనా లేక మిగిలిన ఇద్దరి హీరోయిన్స్ ది మెయినా ? అంటే నేను చెప్పలేను. స్క్రిప్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు అని మా డైరెక్టర్ స్ట్రాంగ్ గా చెప్పారు. కానీ, సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే.

 

‘విజయ్ దేవరకొండ’తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాల కొత్తగా కనిపిస్తాడు. సినిమా చూశాక అసలు మన విజయ్ దేవరకొండేనా అనిపిస్తాడు. సినిమా చేస్తున్నంత సేపూ అసలు నేను విజయ్ దేవరకొండను చూడలేదు. అంతలా క్యారెక్టర్ లో ఇన్ వాల్వ్ అవుతాడు. ఆయన క్యారెక్టర్ కూడా అంత కొత్తగా ఉంటుంది. నాతో చేసిన శీనయ్య క్యారెక్టర్ లో కూడా విజయ్ దేవరకొండకు చాల కొత్తగా ఉంటుంది.

 

‘విజయ్ దేవరకొండ’ సినిమా అంటే హీరోయిన్ తో బోల్డ్ సీన్స్ ఉంటాయని బాగా టాక్. మరి ఈ సినిమాలో కూడా ఉంటాయా ?

ఈ ప్రశ్న ఇప్పటికే నన్ను చాలామంది అడిగారు. విజయ్ దేవరకొండ సినిమాలో యాక్ట్ చేస్తున్నావ్ కదా.. లిప్ లాక్ లు ఏమైనా ఉన్నాయా అని. సినిమాలో ఉన్నాయో లేవో సినిమా చూసాక మీకర్ధమవుతుంది. అయినా కథకు, సీన్ కు నీడ్ అయితే లిప్ లాక్ పెట్టడంలో తప్పేం లేదు.

 

పోస్టర్స్ లో విజయ్ దేవరకొండతో మీ కెమిస్ట్రీ చాల బాగా హైలైట్ అవుతుంది. సినిమా కోసం ఎలాంటి వర్క్ చేశారు ?

ఫస్ట్ నేను నా క్యారెక్టర్ ను బాగా అర్ధం చేసుకుంటాను అండి. దాని కోసం మినిమమ్ రెండు రోజులైనా టైం తీసుకుంటాను. ఇక ఈ సినిమా కోసం 25 డేస్ వర్క్ చేశాను. ఇక విజయ్ కి నాకు మధ్య సీన్స్ బాగా వచాయి అంటే దానికి కారణం కచ్చితంగా మేము చేసిన ప్రాక్టీసే. సీన్ షూట్ చేయకముందే ఇద్దరం సీన్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటాము. సీన్ లో విజయ్ చేసే బెటర్ మెంట్ కూడా చాల బాగుంటుంది.

 

ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పారా ?

లేదండి. నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పాలని చాల ట్రై చేశాను. కానీ టైం సెట్ అవ్వలేదు. బట్ డబ్బింగ్ చెప్పడాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. తరువాత సినిమాకి నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను.

 

తెలుగులో మీ తదుపరి సినిమాల గురించి ?

తెలుగులో ప్రతి ఇయర్ నేను యాక్ట్ చేసిన సినిమాలు రెండు సినిమాలైనా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కదా నా కెరీర్ స్టార్ట్ అయింది. తెలుగులో నేనెవ్వరో కూడా తెలియదు. ఇప్పుడు నానిగారు- శివ నిర్వాణగారి సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా తరువాత నేను తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరవుతాను. తెలుగు అమ్మాయిని ఎలాగూ తెలుగు మాట్లాడతాను కాబట్టి ఇక నుండైనా నా కోసం క్యారెక్టర్స్ రాస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More