‘పుష్పరాజ్’ సిస్టర్ గా ఐశ్వర్య రాజేష్ ?

Published on Apr 26, 2021 7:12 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీకి సోదరి పాత్రలో ఆమె కనిపించబోతుందని.. ఈమె క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఎమోషనల్ ట్రాక్ సినిమాలో చాల కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంది.

కాగా ఆ పోలీస్ పాత్రకు ఐశ్వర్య రాజేష్ పాత్రకు మధ్య చిన్న ట్రాక్ ఉంటుందని.. ఆమె చావుకి అనుకోకుండా ఆ పోలీస్ నే కారణం అవుతాడని.. దాంతో అతని పై బన్నీ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనే సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ పాటలో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :