ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా “రిచి గాడి పెళ్లి ” ఫస్ట్ లుక్ విడుదల

ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా “రిచి గాడి పెళ్లి ” ఫస్ట్ లుక్ విడుదల

Published on Jul 1, 2021 8:00 AM IST

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా, కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న “రిచి గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

“రిచి గాడి పెళ్లి ” పేరుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ…“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్ మరియు ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలను ఒక మధురమైన లవ్ బల్లాడ్ యొక్క లిరికల్ వీడియోతో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు