విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘ఐతే 2.0’ !
Published on Feb 21, 2018 2:43 pm IST

టైటిల్ తోనే కొంత పాపులారిటీని సంపాదించుకున్న ‘ఐతే 2.0’ అన్ని పనుల్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని మార్చి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. 2003లో వచ్చిన చంద్ర ఏఖర్ ఏలేటి ‘ఐతే’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ కాదట.

పూర్తి స్థాయి టెక్నో థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండనుంది. రాజ్ మదిరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఇంద్రనీల్ సేన్ గుప్త, అభిషేక్, కార్తవ్య శర్మ, నీరజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ జార షా హీరోయిన్ గా నటిస్తోంది. విజయ రామరాజు, హేమంత్ వల్లపు రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ చిలివేరు సంగీతం అందించారు.

 
Like us on Facebook